-
-
Home » Andhra Pradesh » West Godavari » vras hagitation-NGTS-AndhraPradesh
-
సీఎం గారూ.. మా గోడు వినండి
ABN , First Publish Date - 2022-02-19T05:56:04+05:30 IST
డిమాండ్ల సాధన కు వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 11వ రోజు కొనసాగాయి.

11వ రోజు డప్పు కొడుతూ వీఆర్ఏల నిరసన
పాలకొల్లురూరల్/యలమంచిలి/కాళ్ళ/వీరవాసరం/ఆచంట/మొగల్తూరు/ భీమవరం అర్బన్/పెనుగొండ/పోడూరు/ఉండి,ఫిబ్రవరి 18 : డిమాండ్ల సాధన కు వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం 11వ రోజు కొనసాగాయి.దీక్షా శిబిరం వద్ద వీఆర్ఏలు డప్పుకొడుతూ తమ పొట్ట కొట్టవద్దంటూ నినాదాలు చేశారు. పాలకొల్లు, యలమంచిలి, భీమవరం, కాళ్ళ, వీరవాసరం, ఆచంట,పెనుగొండ, మొగల్తూరు, పెనుమంట్ర, పాలకోడేరు, ఆకివీడు, పోడూరు, నరసాపురం, ఉండి మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన చేశారు. పలువురు వీఆర్ఏలు మా గోడు వినండహో అంటూ చేతిలో డప్పు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొడుతూనే ఉన్నారు. యల మంచిలి వీఆర్ఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మిరెడ్డి రామకృష్ణ, మట్టపర్తి నర్శింహరావు మాట్లాడుతూ 11 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభు త్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. భీమవరంలో డిప్యూటీ తహసీల్దార్ పవన్‌కు వినతిపత్రాన్ని అందించారు.అర్హులకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించా లని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేసి న్యాయం చేయాలని ఏఐటీ యూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు అన్నారు. మండల కార్యాలయాల వద్ద వీఆర్ఏలు పాల్గొన్నారు.