ఘనంగా గణనాథుల నిమజ్జనం

ABN , First Publish Date - 2022-09-11T06:02:11+05:30 IST

గునుపూడి విద్యాగణపతి ఆలయం వద్ద విద్యాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవ రాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గణనాథుల నిమజ్జనం
కాళ్లలో ఊరేగింపుగా తరలివెళ్తున్న వినాయకుడు

ఉత్సాహంగా గణేష్‌ విగ్రహాల ఊరేగింపు 

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 10 : గునుపూడి విద్యాగణపతి ఆలయం వద్ద విద్యాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవ రాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శనివారం నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్వామి మందిరం వద్ద ఏర్పాటు చేసిన 20 కేజీల లడ్డూ వేలంపాటలో పార్కువద్ద ఉన్న భోగలింగేశ్వరస్వామి ఆలయ అర్చకుడు పునులూరి మంగేష్‌ 30,700 రూపాయలకు దక్కించుకున్నారు. లడూడను కమిటీ సభ్యులు ఆయనకు అందించి అభినందనలు తె లిపారు.

 నరసాపురం : నరసాపురం వశిష్ఠ గోదావరిలో శనివారం రాత్రి బొజ్జ గణపయ్య నిమజ్జనాలు జరిగాయి. పాలకొల్లు, వీరవాసరం, పోడూరు, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలు ట్రాక్టర్లు, మినీ లారీలపై  గోదావరి తీరానికి  తరలి వచ్చాయి. వీటిని క్రేన్‌ సాయంతో మాధవాయిపాలెం రేవు వద్ద నిమజ్జనం చేశారు. 

వీరవాసరం : గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ప్రతిమలు వినాయక మహోత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిమజ్జనాలు పూర్తి చేశారు. వీరవాసరం, నవుడూరు గ్రామాల్లో యువకులు ఉత్సాహంగా నిమజ్జనాల్లో పాల్గొన్నారు. 

కాళ్ళ :  పలు గ్రామాల్లో శనివారం భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా కాళ్ల, పెదఅమిరం, జక్కరం, జువ్వలపాలెం, దొడ్డనపూడి, కోపల్లె తదితర గ్రామాల్లో వినాయక నిమజ్జనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విచిత్ర వేషధారణలతో మేళతాళాలు, తీన్మార్‌ వాయిద్యాల నడుమ యువత వినాయక విగ్రహాల ఊరేగింపు నిర్వహించి అనంతరం పంట కాల్వల్లో నిమజ్జనం చేశారు.

పాలకోడేరు : విస్సాకోడేరులోని గాంధీపేటలో గణేష్‌ 26 వార్షిక మహోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే మంతెన రామరాజు పూజలు చేశారు. ఈ సదర్భంగా కమిటీ సభ్యులు రామరాజును సత్కరించారు. డీటీ కోటేశ్వరరాజు, ఎన్‌వీ అప్పారావు, దండు సుబ్బరాజు, కళ్యాణ్‌, గుత్తుల త్రినాథ్‌, కునుకు అప్పారావు, డి.వెంకటేశ్వరరావు, పెద్దిరాజు, గంగాధరరావు పాల్గొన్నారు.  

యలమంచిలి : యలమంచిలి యూత్‌ ఆధ్వర్యంలో హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహ నిమజ్జనోత్సవం శనివారం నిర్వహించారు. టీడీపీ నాయకుడు కొడవటి ఫణి విగ్రహ ఏర్పా టుకు రూ.18వేలు విరాళం అందించారని నిర్వాకులు తెలిపారు. చేగొండి బాబ్జి, గుబ్బల జగన్‌, లింగం సురేష్‌, సునిల్‌, సురేంద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

పెంటపాడు : అలంపురం టీబీఆర్‌ సైనిక్‌ పాఠశాలలో చైౖర్మన్‌ తనుబుద్ది భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి శనివారం ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. తొలుత లక్కీ డిప్‌ ద్వారా సుమారు 20 మందికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి హోండా ఏక్టివా, రెండో బహుమతి ఎల్‌ఈడీ టీవీ, మూడో బహుమతి ఫ్రిజ్‌, నాలుగో బహుమతి ఒక గ్రాం గోల్డ్‌ తదితర బహుమతులు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం నాయకుడు గమిని సుబ్బారావు, కరస్పాండెంట్‌ పద్మావతి, డైరెక్టర్‌ రవికిరణ్‌, ప్రిన్సిపల్‌ పర్వీన్‌కుమారిశర్మ, హెచ్‌ఎం దుర్గాప్రసాద్‌, వాఖ్యాత పవన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పెనుమంట్ర : నవుడూరు సెంటర్‌లోని వర సిద్ధి వినాయక నవరాత్రి ముగింపు సందర్భంగా పురోహితులు ఉద్వాసన పూజలు నిర్వహించారు. అనంతంరం ప్రత్యేక వాహనంలో గ్రామోత్సవం, పొలమూరు తూర్పుకాల్వలో నిమజ్జనం చేశారు. చేసారు. పొలమూరు దేవర చెరువుగట్టు వద్ద ఉన్న వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. 



Updated Date - 2022-09-11T06:02:11+05:30 IST