ఎరువుల నిల్వలపై విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-09-10T06:30:45+05:30 IST

పి.అంకంపాలెంలో ఎరువులు పురుగు మందుల నిల్వలపై విజిలెన్స్‌ వ్యవసా య అధికారులు తనిఖీలు చేశారు.

ఎరువుల నిల్వలపై విజిలెన్స్‌ తనిఖీలు

జీలుగుమిల్లి, సెప్టెంబరు 9: పి.అంకంపాలెంలో ఎరువులు పురుగు మందుల నిల్వలపై విజిలెన్స్‌ వ్యవసా య అధికారులు తనిఖీలు చేశారు. గ్రామంలో ఒ గొడౌన్‌లో అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్‌ అధి కారులకు సమాచారం రావటంతో విజిలెన్స్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌ శుక్ర వారం సాయంత్రం తనిఖీలు జరిపారు. అయితే కొందరు రైతులు తాము వేరుశనగ పంట వేస్తున్నామని అవ సరం నిమిత్తం పది మంది కలసి వాటిని తెచ్చుకున్నట్లు అధికారులకు చెప్పారు. వీటి బిల్లులు పరిశీలించి విచారణ జరుపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు రూ.16 లక్షలు విలువ చేసే ఎరువులు, పురుగుమందులు ఉన్నట్లు  చర్చ జరుగుతుంది. కెఆర్‌పురం ఏడీఏ బుజ్జిబాబు, ఏవో గంగాధరం ఉన్నారు.


Read more