ప్రభుత్వ దుకాణం నుంచి మద్యం తరలింపు

ABN , First Publish Date - 2022-02-19T05:59:23+05:30 IST

రాట్నాలకుంట ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా రూ.1,15,200 విలువైన మద్యంతోపాటు వాహనాన్ని సీజ్‌ చేశామని పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపారు.

ప్రభుత్వ దుకాణం నుంచి మద్యం తరలింపు

రూ.1.15 లక్షల విలువైన బాటిళ్లు స్వాధీనం, వాహనం సీజ్‌

పెదవేగి, ఫిబ్రవరి 18:రాట్నాలకుంట ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా రూ.1,15,200 విలువైన మద్యంతోపాటు వాహనాన్ని సీజ్‌ చేశామని పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపారు. రాట్నాల కుంట ప్రభుత్వ దుకాణం నుంచి టాటా ఏస్‌ వాహనంలో మద్యం అక్రమం గా తీసుకెళ్తున్నారని సమాచారం రావడంతో పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ వాహ నాన్ని ఆపి, వాహనంతోపాటు మద్యాన్ని సీజ్‌ చేశారు. ఈ మద్యాన్ని అదే దు కాణంలో పనిచేస్తున్న పసుపులేటి రమేష్‌ సాయంతో కృష్ణా జిల్లా ముసు నూరు మండలం బలివేకు చెందిన నాగుల నాగరాజు అనేవ్యక్తి టాటా ఏస్‌ వాహనంలో తీసుకెళ్తుండగా నిలువరించారు. నిందితుడిని అదుపులోకి తీసు కుని పెదవేగి పోలీస్‌ స్టేషన్‌ను తరలించి కేసు నమోదు చేశామన్నారు. 

Read more