ఎంపీడీవో కార్యాలయంలో టీవీలు చోరీ

ABN , First Publish Date - 2022-11-21T00:36:58+05:30 IST

నూజివీడు మండల పరిషత్‌ కార్యా లయంలో టీవీలు అపహరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎంపీడీవో కార్యాలయంలో టీవీలు చోరీ
చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఐ మురళీకృష్ణ

నూజివీడు టౌన్‌, నవంబరు 20: నూజివీడు మండల పరిషత్‌ కార్యా లయంలో టీవీలు అపహరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదురోజుల క్రితం నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో గల రెండు టీవీలు అపహరణకు గురయ్యాయి. అనారోగ్య కారణాలతో ఎంపీడీవో జి.రాణి సెలవుపై ఉండగా, కార్యాలయ సిబ్బంది నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఏలూరు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ మురళీకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ సీహెచ్‌ మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-11-21T00:36:58+05:30 IST

Read more