టెన్త్‌ ఫలితాల్లో ‘త్రివిధ’ ప్రతిభ

ABN , First Publish Date - 2022-06-07T06:40:52+05:30 IST

నూజివీడు త్రివిధ పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కన బర్చినట్టు ప్రిన్సిపాల్‌ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

టెన్త్‌ ఫలితాల్లో ‘త్రివిధ’ ప్రతిభ
వి.లక్ష్మీసాయి గీతిక 592 మార్కులు

నూజివీడు టౌన్‌, జూన్‌ 6: నూజివీడు త్రివిధ పాఠశాల విద్యార్థులు ఎస్‌ఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కన బర్చినట్టు ప్రిన్సిపాల్‌ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. పాఠశాలకు చెందిన వేమూరి లక్ష్మి సాయి గీతిక 592 మార్కులు, మండల లావణ్య 591, ఇడుపల్లి హిమజ 591, బీమా తేజశ్విని మోహన 590 మార్కులు సాధించా రన్నారు. మొత్తం 153 మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారని  చెప్పారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అధ్యాపక, అధ్యాకేతర సిబ్బంది అభినందించారు. 


Read more