డబ్లింగ్‌ పట్టాలెక్కిన కరెంట్‌ రైలు

ABN , First Publish Date - 2022-03-16T05:33:00+05:30 IST

నరసాపురం – భీమవరం– ఆరవల్లి మధ్య కొత్తగా నిర్మించిన ఎలక్ర్టికల్‌ డబ్లింగ్‌ లైన్‌పై మంగళవారం కరెంట్‌ ఇంజన్‌ నడిచింది.

డబ్లింగ్‌ పట్టాలెక్కిన కరెంట్‌ రైలు
కరెంట్‌ రైలును పర్యవేక్షిస్తున్న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాయ్‌

పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ అభయ్‌రాయ్‌


 నరసాపురం/ఉండి, మార్చి 15 : నరసాపురం – భీమవరం– ఆరవల్లి మధ్య కొత్తగా నిర్మించిన ఎలక్ర్టికల్‌ డబ్లింగ్‌ లైన్‌పై మంగళవారం కరెంట్‌ ఇంజన్‌ నడిచింది. ముందుగా ఉండి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైల్వే సెఫ్టీ కమిషనర్‌ అభయ్‌రాయ్‌ అక్కడ నుంచి ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు.  భీమవరం టౌన్‌, ఆర వల్లి అనంతరం నరసాపురం రైల్వే స్టేషన్లలో విద్యుత్‌ లైన్ల పనితీరు పరిశీలిం చారు.నరసాపురం నుంచి భీమవరం వరకు ఎలక్ర్టికల్‌ ఇంజన్‌ నడిపారు. అక్కడ నుంచి అత్తిలి మండలం ఆరవల్లి వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహిం చారు.గత నెలలో రాయ్‌ పర్యవేక్షణలో కొత్త రైల్వే ట్రాక్‌పై ట్రయల్‌ రన్‌ నిర్వహించగా తాజాగా ఎలక్ర్టికల్‌ లైన్‌ పని తీరును పర్యవేక్షించారు.2020లోనే భీమవరం నుంచి విజయవాడ వరకు డబ్లింగ్‌ విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యా యి.ఈ మేరకు ఉండి నుంచి గుడివాడ, విజయవాడ వరకు డబ్లింగ్‌ ట్రాక్‌లో రైలు రాక పోకలను ప్రారంభించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.  భీమ వరం – నిడదవోలు మధ్య చేపట్టిన డబ్లింగ్‌ పనులు ఆరవల్లి వరకే పూర్త య్యా యి. పెండింగ్‌ పనులు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


Updated Date - 2022-03-16T05:33:00+05:30 IST