నేడు ‘శశి’లో నీట్‌ కౌన్సెలింగ్‌పై అవగాహన

ABN , First Publish Date - 2022-09-18T05:26:48+05:30 IST

వేలివెన్ను శశి ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లో ఆదివారం నీట్‌ కౌన్సెలింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నేడు ‘శశి’లో నీట్‌ కౌన్సెలింగ్‌పై అవగాహన

తణుకు, సెప్టెంబరు 17: వేలివెన్ను శశి ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లో ఆదివారం నీట్‌ కౌన్సెలింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ నిపుణులతో కౌన్సెలింగ్‌ విధివిధానాలు, ఆలిండియా కోటా, స్టేట్‌ కోటా, లోకల్‌, నాన్‌లోకల్‌, పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేయనున్నారని తెలిపారు.

Read more