నేడు హైకోర్టు జడ్జి జిల్లా పర్యటన

ABN , First Publish Date - 2022-04-24T06:18:27+05:30 IST

రాష్ట్ర హైకోర్టు జడ్జి అసనుద్దీన్‌ అమానుల్లా ఆదివారంనాడు ఏలూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నేడు హైకోర్టు జడ్జి జిల్లా పర్యటన

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23 : రాష్ట్ర హైకోర్టు జడ్జి అసనుద్దీన్‌ అమానుల్లా ఆదివారంనాడు ఏలూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు న్యాయాధికారులతో సమావేశమై అనంతరం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌ హాలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యులు, ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లతో సమావేశమవుతారు. అనంతరం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని గోదావరి సమావేశపు హాలులో మహిళా సాధికారత – బాలికా విద్య అనే అంశంపై ఏర్పాటు చేసిన న్యాయ సేవా సదస్సులో పాల్గొంటారు.


Read more