తోటపల్లి క్వారీని తనిఖీ చేసిన డీఐజీ

ABN , First Publish Date - 2022-09-28T06:18:47+05:30 IST

ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో గ్రావెల్‌ క్వారీని తనిఖీ చేశారు.

తోటపల్లి క్వారీని తనిఖీ చేసిన డీఐజీ

ఆగిరిపల్లి, సెప్టెంబరు 27 : ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో గ్రావెల్‌ క్వారీని తనిఖీ చేశారు. ఇక్కడ గ్రావెల్‌ తవ్వకాలు నిలిపి వేయాలని కోర్టు ఆదేశించినా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నట్టుగా స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని పోలీసులపై మండిపడింది. వెంటనే ఇక్కడ జరగుతున్న వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్సీ రాహుల్‌ దేవ్‌ శర్మ, నూజివీడు డీఎస్పీ బి.శ్రీని వాసులు, సీఐ ఆర్‌.అంకబాబులతో కలసి డీఐజీ గ్రావెల్‌ తవ్వకాలు జరిగిన క్వారీని పరిశీలించారు. ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తహసీల్దార్‌ ఎం.ఉదయభాస్కరరావు తదితరులు ఉన్నారు.

Read more