జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-03-16T06:31:49+05:30 IST

కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారి ఆలయంలో జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.

జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం

ఆకివీడు రూరల్‌ మార్చి 15 : కొల్లేటికోట శ్రీపెద్దింటి అమ్మవారి ఆలయంలో జలదుర్గా, గోకర్ణేశ్వరస్వామి కల్యాణం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. కల్యాణానికి గోకర్ణపురం నుంచి స్వామి, అమ్మవార్ల ప్రభలు మేళతాళాలతో ఊరేగింపుగా తరలి వచ్చాయి. గ్రామస్థులు పెళ్లి సామగ్రి, కలశాలతో బాజా భజంత్రీ లతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. దెందు లూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Read more