అసెంబ్లీ సాక్షిగా జగన్ పచ్చి అబద్ధాలు: డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర

ABN , First Publish Date - 2022-09-20T00:53:57+05:30 IST

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ అబద్ధాలు చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో...

అసెంబ్లీ సాక్షిగా జగన్ పచ్చి అబద్ధాలు: డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ (Cm Jagan) అబద్ధాలు చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు (Dasari Syam Chandra Seshu) ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలకు తెర తీశారని మండిపడ్డారు. 6 లక్షల 16 వేల 323 ఉద్యోగాలు భర్తీ చేశామని.. అందులో లక్షా 28 వేల సచివాలయ ఉద్యోగులను తీసుకోవడంతో పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో 952 ఉద్యోగాలను భర్తీ చేశామని.. అదే విధంగా 2 లక్షల 60 వేల 868 వాలంటీర్ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. వాలంటీర్లను తమ పార్టీ సేవకులిగా చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వాలంటీర్ ఉద్యోగులకు మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం 16 వేల 500 జీతం ఇవ్వాలని.. వాళ్ల శ్రమను దోపిడీ చేస్తున్న సీఎం జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకి ఎక్కుతాడని దాసరి శ్యామచంద్ర శేషు అన్నారు


Read more