మళ్లీ సీపీఎస్‌ పోరాటం

ABN , First Publish Date - 2022-04-10T05:42:40+05:30 IST

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీ ఎస్‌ను రద్దు చేస్తానని సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇచ్చి.. సుమారు 28 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ.నర్శింహరావు అన్నారు.

మళ్లీ సీపీఎస్‌ పోరాటం
పాలకొల్లులో పోస్టర్లను విడుదల చేస్తున్న ఉపాధ్యాయులు

ఈ నెల 18 నుంచి యూటీఎఫ్‌ బైక్‌ జాతా


పాలకొల్లుఅర్బన్‌, ఏప్రిల్‌ 9 :
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీ ఎస్‌ను రద్దు చేస్తానని సీఎం జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇచ్చి..  సుమారు 28 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ.నర్శింహరావు అన్నారు.సమతా భవనంలో శని వారం జరిగిన డివిజన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మోటారు సైకిల్‌ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. ర్యాలీ శ్రీకాకుళంలో ప్రారంభమై జిల్లాలోకి 23వ తేదీ నాటికి చించినాడ బ్రిడ్జి మీదుగా చేరుకుంటుందన్నారు. ఆ రోజున 500 మోటారు సైకిళ్లతో స్వాగతం పలకాలన్నారు.సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏకేవీ.రామబధ్రం,పి.శ్రీనివాసరావు, వి.జగ్గారావు, వై.ప్రభాకర శాస్త్రి, కె.త్రినాధ్‌, పి.క్రాంతి కుమార్‌, కె.రాజశేఖర్‌, బాదంపూడి రాజు పాల్గొన్నారు.


భీమవరం ఎడ్యుకేషన్‌ :  తుందుర్రు, వెంప, దిరుసుమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో శనివారం పోరు గర్జన బైక్‌ జాతా వాల్‌ పోస్టర్లు ఆవిష్కరించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ పట్టాభిరామయ్య మాట్లాడుతూ బైక్‌ జాతా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ సాగుతుందన్నారు. కార్యక్రమంలో సిహెచ్‌ కుమారబాబ్జి పాల్గొన్నారు.


మొగల్తూరు : సీపీఎస్‌ అంతం..యూటీఎఫ్‌ పంతం అనే నినాదంతో పోరా టం చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుతామని యూటీఎఫ్‌ మండల శాఖ ప్రధాన కార్యదర్శి కొల్లాటి బ్రహ్మయ్య అన్నారు. ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ పాఠశాలలో శనివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్ర మంలో రాష్ట్ర కౌన్సిలర్‌ సీహెచ్‌.కృష్ణమోహన్‌, కె.గోపాలకృష్ణంరాజు,  నాగరాజు కుమార్‌, దొంగ చింతయ్య,టి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


కాళ్ళ : సీపీఎస్‌ రద్దుకు యూటీఎఫ్‌ తలపెట్టిన పోరు గర్జన బైక్‌ జాతా విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.పట్టాభిరాయమ్య పిలుపునిచ్చారు. ఎల్‌ఎన్‌పురం ప్రాథమికోన్నత పాఠశాలలో పోరు గర్జన బైక్‌ జాతా వాల్‌ పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జి.రామకృష్ణంరాజు, బి.కిషోర్‌, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more