రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలి

ABN , First Publish Date - 2022-03-18T05:37:17+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించాలని తెలుగు మహిళ నేతలు అమ్మవార్లను వేడుకున్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలి
నందిగూడెంలో అమ్మవార్ల ఆలయం వద్ద తెలుగు మహిళ నేతలు

అమ్మవార్లను వేడుకున్న తెలుగు మహిళ నేతలు


గోపాలపురం, మార్చి 17: రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించాలని తెలుగు మహిళ నేతలు అమ్మవార్లను వేడుకున్నారు. నందిగూడెం పెద్దింట్లమ్మ, శ్రీకనకదుర్గమ్మ అమ్మవార్ల ఉత్సవాల సందర్భంగా తెలుగు మహిళ నేతలు గురువారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు ఉండవల్లి రత్నకుమారి  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సుధారాణి, రాజమండ్రి పార్లమెంట్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి విలవిల్లాడుతున్నారన్నారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికి మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళల రక్షణ కోసం దిశా చట్టాలను అమలులోకి తెచ్చి మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రభుత్వాలు దిశా చట్లం ఏమైందో, ఏం చేస్తుందో, ఎక్కడ ఉందో మహిళలు అర్థం కావడం లేదన్నారు. రాక్షసపాలన అంతమొందించి రాష్ట్రంలో ప్రజాభీష్ట పరిపాలన రావాలని అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సతీమణి ముప్పిడి సుజాత, దేవరపల్లి మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షురాలు బాదంపూడి ఇందిర, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షురాలు కాకర్ల సృజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T05:37:17+05:30 IST