కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-09-14T04:59:50+05:30 IST

మండలంలోని పూలపల్లి ఈదా వారి పేటలో రూ.15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మా ణానికి ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళ వారం శంకుస్థాపన చేశారు.

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

పాలకొల్లు రూరల్‌, సెప్టెంబరు 13: మండలంలోని పూలపల్లి ఈదా వారి పేటలో రూ.15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళ వారం శంకుస్థాపన చేశారు. టీడీపీ పాలనలో రూ 10లక్షలు నిధులు మంజూరు చేసినప్పటీకీ ప్రభుత్వం మారడంతో పనులు జరగలేదన్నారు అధికారంలో లేకున్నా ఎంపీ నిధుల నుంచి కనక మేడల రవీంద్రకుమార్‌ రూ 2కోట్లు మంజూరు చేశారన్నారు. మాజీ సర్పంచ్‌ కళాజ్యోతి, కోడి విజయభాస్కర్‌, గూడవల్లి తాతయ్య, గుబ్బల హరిప్రసాద్‌, నాగరాజు, శ్రీహరి రాజు,  గ్రామస్తులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––

Read more