అడ్డుకున్నా.. అడ్డదారుల్లో

ABN , First Publish Date - 2022-09-25T06:31:04+05:30 IST

అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం గుడివాడ వెళ్తున్న టీడీపీ శ్రేణులకు అడుగడుగునా పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి.

అడ్డుకున్నా.. అడ్డదారుల్లో
మహా పాదయాత్రలో పాల్గొన్న కైకలూరు టీడీపీ నాయకులు

మహా పాదయాత్రకు టీడీపీ నేతల సంఘీభావం


ముదినేపల్లి, సెప్టెంబరు 24: అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు శనివారం గుడివాడ వెళ్తున్న టీడీపీ శ్రేణులకు అడుగడుగునా పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. కైకలూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి గుడివాడ వెళ్లే నాయకుల కార్లను, ఇతర వాహనాలను ముదినేపల్లిలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న సమయంలో కొందరు టీడీపీ నాయకులు తమ కార్లలో గుడివాడ వెళ్లే ప్రయత్నం చేశారు. తెలుగు రైతు ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి బొప్పన సుందర రామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు చలసాని జగన్మోహనరావు, ఈడ్పుగంటి శ్రీనివాస్‌, డీసీ మాజీ చైర్మన్‌ లింగమనేని భాను ప్రసాద్‌, కైకలూరు మండల నాయకులు పెన్మెత్స త్రినాథ రాజు, పోలవరపు లక్ష్మీరాణి, మరీ కొందరు వేర్వేరు కార్లలో ముదినేపల్లి దాటి వెళ్తుండగా గమనించిన ఒక కానిస్టేబుల్‌ ఎస్‌ఐ షణ్ముఖ సాయికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ తన వాహనంలో టీడీపీ నాయకులు కోడూరు గ్రామం మీదుగా వెళ్తుండగా, వారి కార్లను 10 కిలోమీటర్లు వెంబడించి మార్గమధ్యంలో ఆపేశారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం నాయకులను ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కొద్దిసేపటి తర్వాత పంపించారు. అయితే వారు పట్టువదలని విక్రమార్కుల్లా విన్నకోట చంద్రాల మీదుగా గుడివాడ చేరుకుని దేవినేని ఉమా, కొల్లు రవీంద్రతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ నేత కొడాలి వినోద్‌ కూడా చంద్రాల మీదుగా తమ అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలసి గుడివాడ చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు దావు నాగరాజు, కందేపి పద్మ తదితరులు ముదినేపల్లి మండలం నుంచి వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు. 


సంఘీభావం నేరమా?

 ఉద్యమం చేసే వారికి సంఘీభావం తెలపటం కూడా నేరమేనా అంటూ ముదినేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ప్రశ్నించారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేం దుకు వెళ్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించటం దారుణమన్నారు. ఇది ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇక ముందు బాధల్లో ఉన్న వారిని పరామర్శించటం కూడా నేరమవుతుందేమోనన్నారు. పోలీసుల చర్యలను శ్రీహరిపురం సర్పంచ్‌ పరసా విశ్వేశ్వరరావు,  పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొంగు రవికుమార్‌, కార్యదర్శి యర్రా రాంబాబు ఖండించారు. 


జయమంగళ ఇంటి వద్ద పోలీసుల నిఘా... అయినా

కైకలూరు:  మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ ఇంటి వద్ద శనివారం ఉదయం నుంచే పోలీసులు నిఘా ఉంచారు. అయినా ఆయన తప్పించుకుని పాదయాత్రకు వెళ్తున్న సమయంలో ముదినేపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు.  కైకలూరు టీడీపీ నాయకులు బీకేఎం నాని, పూల రామచంద్ర రావు, దావునాగరాజు మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, పిన్నమనేని వెంకటేశ్వరరావుతో కలసి పాదయాత్రలో పాల్గొన్నా రు. అలాగే కైకలూరు మండలం నుంచి మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పెన్మెత్స త్రినాథరాజు, పి.రాధాకృష్ణ, ఈదా వెంకటస్వామి, పోలవరపు లక్ష్మీరాణి, తెంటు వెంకట రమణ, గంగుల శ్రీదేవి, గుజ్జల రామలక్ష్మి, తలారి రాజేష్‌, ఎండీ ఉస్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలిదిండి: మహాపాదయాత్రకు కలిదిండి టీడీపీ నేతలు, రైతులు తరలి వెళ్లారు. ముదినేపల్లిలో కార్లను పోలీసులు అడ్డుకోవటంతో బైక్‌లపై వెళ్లి అంగ లూరు వద్ద పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపా మన్నారు. మహాపా దయాత్రకు పార్టీలకతీతంగా ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారన్నారు. పోకల జోగిరాజు, వల్లభనేని శ్రీనివాస్‌ చౌదరి, దున్న భోగే శ్వరరావు, దుగ్గిరాల పరమేశ్వరరావు, పోకల వెంకటేశ్వరరావు, పోకల శ్రీను బాబు, ముద్దం భోగేశ్వరరావు, అండ్రాజు శ్రీనివాసరావు, మణికంఠ పాల్గొన్నారు. 

ముదినేపల్లి రూరల్‌: టీడీపీ నాయకుడు కొడాలి వినోద్‌ ఆధ్వర్యంలో 200 మంది యువకులు బైక్‌లపై ర్యాలీగా గుడివాడ తరలివెళ్లారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని  సంఘీభావం తెలిపారు.  

Updated Date - 2022-09-25T06:31:04+05:30 IST