వైసీపీ పాలనలో ప్రజలకు అన్యాయం

ABN , First Publish Date - 2022-12-09T23:55:27+05:30 IST

తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌ ప్రజలకు, రాష్ర్టానికి ఏం న్యాయం చేస్తాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలకు అన్యాయం
గునుపూడిలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

యలమంచిలి, డిసెంబరు 9: తల్లిని, చెల్లిని గెంటేసిన జగన్‌ ప్రజలకు, రాష్ర్టానికి ఏం న్యాయం చేస్తాడని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. మండలంలోని దొడ్డిపట్లలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ శ్రేణులతో కలిసి ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వ హించారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారని, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతి రేక విధానాల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు ఏకరువు పెడుతున్నారన్నారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దొడ్డి పట్ల – పాలకొల్లు ప్రధాన రహదారి పలుచోట్ల అధ్వానంగా మారి రాకపోక లకు అవస్థలు పడుతున్నామని పలువురు గ్రామస్థులు ఎమ్మెల్యే నిమ్మలకు విన్నవించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు, చేగొండి రవిశంకర్‌, కడలి గోపి, పీతల శ్రీను, మల్లాడి ధర్మ, సేరి కృష్ణ, గుబ్బల మోహనరావు, యర్రంశెట్టి పండు, లక్కోజు శేషు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం అర్బన్‌: వైసీపీ ప్రభుత్వం అధిక పన్నులతో సామాన్య ప్రజ ల నడ్డి విరుస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నా రు. భీమవరం నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గునుపూడి 8వ అసెంబ్లీ క్లస్టర్‌ ఇంచార్చ్‌ యోద్దు ఏసుపాదం అధ్యక్షతన 16, 17 వార్డులలో ఇదేం ఖర్మ మన రాష్ట్రనికి అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సీతారామలక్ష్మిమాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరలను కట్టడి చేయలేని జగన్‌ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. మెంటే పార్థసారథి, మెరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాదు, మాదాసు కనకదుర్గ, సయ్యద్‌ నసీమాబేగం, ఎండీ షబీనా, మైలబత్తుల ఐజాక్‌ బాబు, గంటా త్రిమూర్తులు, గోవిందు పాల్గొన్నారు.

వీరవాసరం: రైతు సంక్షేమం, రైతు భరోసా అంటూ వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించడం లేదని టీడీపీ నాయకులు అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పాలని ప్రచారం చేశారు. వీరవాసరం పంచాయతీ పరిధిలోని తలతాడితిప్పలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి నిర్వహించారు. రైతులకు తుగ్లక్‌ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను తెలియచేస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి పోస్టర్లును ప్రదర్శించారు. ఈ సందర్బంగా ధాన్యం అమ్మకాలకు వెడుతుంటే ఆర్‌బికెల వద్ద ఎదురవుతున్న సమస్యలను టీడీపీ నాయకుల దృష్టికి రైతులు తీసుకు వచ్చారు. కొల్లేపర శ్రీనివాసరావు, కముజు హరిబాబు, పంపన సుధాకర్‌, రాయపల్లి వెంకట్‌, వీరవల్లి చంద్రశేఖర్‌, వీరవల్లి గణేష్‌, వీరవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:55:29+05:30 IST