కందుకూరు సంఘటన దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-12-30T00:01:27+05:30 IST

కందుకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు పర్యటనలో కార్యకర్తలు మృతి చెందడం విచారకరమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

కందుకూరు సంఘటన దురదృష్టకరం
కందుకూరు మృతులకు నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

భీమవరం అర్బన్‌, డిసెంబరు 29: కందుకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు పర్యటనలో కార్యకర్తలు మృతి చెందడం విచారకరమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలని పార్టీ కార్యాలయంలో గురువారం సంతాప సభ నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎనిమిది మంది కార్యకర్తల మృతి బాధాకర మని, వారి కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. అన్ని చోట్ల నుంచి నాయకులు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె సూచించారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు చంద్రబాబు పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని, నేతలు, కార్యకర్తలు కూడా ఆదుకోవాలని పిలుపునిచ్చా రు. మెరగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాద్‌, మైలబత్తుల ఐజాక్‌బాబు, గునుపూడి తిరుపాల్‌, సయ్యద్‌ నసీమాబేగం, బొక్కా సూరిబాబు, చెల్లబోయిన గోవిందు, గంటా త్రిముర్తులు, మద్దుల రాము పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌: కందుకూరు ఘటనలో మృతుల ఆత్మశాంతి కోరుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి మాట్లాడుతూ పోలీసులు తగిన బందో బస్తు ఏర్పాట్లు చేయకపోవడమే ఘటనకు కారణమన్నారు. కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, సబ్నీసు కృష్ణమోహన్‌, షేక్‌ బాజి, ముప్పిడి రమేష్‌, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

తణుకు: కందుకూరులో చంద్రబాబు బహిరంగ సభలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మృ తులకు నివాళులర్పించారు. మృతుల పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా విద్య నందిస్తామని చంద్రబాబు చెప్పారని, టీడీపీ అండగా ఉంటుందన్నారు.

Updated Date - 2022-12-30T00:01:30+05:30 IST