ఎన్నికలకు సమాయత్తం కావాలి

ABN , First Publish Date - 2022-06-07T06:35:03+05:30 IST

ఎన్నికలకు సమాయత్తం కావాలి

ఎన్నికలకు సమాయత్తం కావాలి
సమావేశంలో పాల్గొన్న ఆనందరావు, తోట సీతారామలక్ష్మి

టీడీపీ శ్రేణులకు నేతల పిలుపు
భీమవరం అర్బన్‌, జూన్‌ 6: రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రతీ కార్యకర్త, నాయకుడు సమాయత్తం కావాలని అమలాపురం మాజీ ఎమ్మె ల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. టీడీపీ భీమవరం అసెంబ్లీ క్లస్టర్‌ ఇన్‌చార్జిల సమావేశాన్ని సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర పరిశీలకుడిగా విచ్చేసిన ఆనందరావు మాట్లాడారు. ప్రతి క్లస్టర్‌లోని ఐదు వేల ఓటర్లకు యూనిట్‌ ఇన్‌చార్జి, ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఇన్‌చార్జిని నియమించి ఓటర్ల జాబితాను పరిశీలన చేయించాలని సూచించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు వెన్నంటి ఉన్నవారికి పదవుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తామని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ మెరగాని నారాయణమ్మ, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్‌, పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, నాయకులు కొల్లిపర శ్రీనివాస్‌, వీరవల్లి  శ్రీనివాస్‌, వెంకన్న, పృథ్వీశంకర్‌, గోపి పాల్గొన్నారు.

Read more