సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థన

ABN , First Publish Date - 2022-09-26T05:13:18+05:30 IST

ఎన్‌టీఆర్‌ పేరును హెల్త్‌ యూని వర్శిటీ నుంచి తొలగించకుండా ముఖ్య మంత్రి జగనోహ్మన్‌రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించినట్టు ఏలూరు జిల్లా టీడీపీ క్రిస్టియన్‌సెల్‌ అధ్యక్షుడు జుంజు మోజేష్‌ అన్నారు.

సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థన
చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబర్‌ 25:  ఎన్‌టీఆర్‌ పేరును హెల్త్‌ యూని వర్శిటీ నుంచి తొలగించకుండా ముఖ్య మంత్రి జగనోహ్మన్‌రెడ్డికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించినట్టు ఏలూరు జిల్లా టీడీపీ క్రిస్టియన్‌సెల్‌ అధ్యక్షుడు జుంజు మోజేష్‌ అన్నారు. ఆదివారం ఇజ్రాయిల్‌పేట చర్చ్‌లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం  మోజేష్‌ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు పేరును హెల్త్‌ యూనివర్శిటికి కొనసాగించాలని అన్నారు. 


Read more