-
-
Home » Andhra Pradesh » West Godavari » tdp leaders given complaints to police station to take action on kodali nani-NGTS-AndhraPradesh
-
నానిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-09-13T06:02:56+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేసి శిక్షించాలని సోమవారం టీడీపీ శ్రేణులు చాట్రాయి పోలీస్టేషన్ ఏఎస్‌ఐ గజపతిరావుకు ఫిర్యాదు చేశారు.

చాట్రాయిలో టీడీపీ ఆందోళన
ఏఎస్‌ఐకు ఫిర్యాదు అందజేత
ఆగిరిపల్లిలోను తెలుగుతమ్ముళ్ల ఫిర్యాదు
చాట్రాయి, సెప్టెంబరు 12: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేసి శిక్షించాలని సోమవారం టీడీపీ శ్రేణులు చాట్రాయి పోలీస్టేషన్ ఏఎస్‌ఐ గజపతిరావుకు ఫిర్యాదు చేశారు. తొలుత స్థానిక సెంటర్‌లో నిరసన తెలిపారు. అనంతరం ప్రదర్శనగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేశారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నాయకులు మందపాటి బసవారెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు, మరిడి చిట్టిబాబు, రామచంద్రరావు, నోబుల్‌రెడ్డి, దుర్గారావు, కందుల కృష్ణ, చంద్రకళ, ధనలక్ష్మి, చెన్నారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: కొడాలి నాని చంద్రబాబు కుటుంబంపై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక టీడీపీ నేతలు నానిని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రిగా పనిచేసిన నాని తన హోదా మరిచి నీచ మైన భాష మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, నక్కనబోయిన వేణు, విక్టర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పకుంటే తిరగనివ్వం..
నూజివీడు టౌన్: రాజకీయ భిక్షపెట్టిన పార్టీ పై ఆరోపణలు చేస్తున్న కొడాలి నానికి గుడివాడలో గోరీ కట్టేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని, నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు అన్నారు. నూజివీడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దని, అమరావతే రాజధాని అని చెప్పి ఇప్పుడు మడమతిప్పారన్నారు. చంద్రబాబు నాయుడిపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే కొడాలి నానిని బయట తిరగనివ్వమన్నారు. నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గా ప్రసాద్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు పౌల్‌రాజు, నాయకులు వీరమాచినేని సత్యనారాయణ, అక్కినేని చందు, పామర్తి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
నానివి దిగజారుడు రాజకీయాలు
ముదినేపల్లి: నాని దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. తెలుగు యువత కైకలూరు నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, పార్టీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి రెడ్డి నాగరాజు, నియోజ కవర్గ కార్యదర్శి నాగ శ్రీనివాస్, అల్లూరు అధ్యక్షుడు నీలిపల్లి సన్యాసిరావు, ఐటీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీను, టీడీపీ ముదినేపల్లి మండల కార్యదర్శి యర్రా రాంబాబు సోమవారం అల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ మెప్పు కోసం నాని చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు తగవని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.