అమరావతి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు

ABN , First Publish Date - 2022-09-25T04:15:21+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు శనివారం ఉదయం గుడివాడకు భారీగా తరలివెళ్ళాయి.

అమరావతి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు
పాదయాత్రలో పాల్గొన్న దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు

పాదయాత్రకు తరలిన టీడీపీ శ్రేణులు

పెదవేగి, సెప్టెంబరు 24: ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. అమరావతి కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఎంతకైనా పోరాడ తాం. ఒక్క ప్రభాకర్‌ను ఆపితే వందమంది ప్రభాకర్‌లు పుట్టుకొస్తారు’  అని టీడీపీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తాతా సత్యనారాయణ అన్నారు. అమరావతి రైతుల  మహాపాదయాత్రకు మద్దతుగా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ శ్రేణులు శనివారం ఉదయం గుడివాడకు భారీగా తరలివెళ్ళాయి. పాదయాత్రలో లక్ష్మీపురం సర్పంచ్‌ మూకా కనకరాజు, టీడీపీ నాయకులు మంచి నేని శ్రీనివాసరావు, పామర్తి నాగభూషణం, తాతా రవికుమార్‌, బొల్లికొండ శ్రీనివాస రావు, బత్తిన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Read more