చంద్రబాబు పిలుపుతో వదర బాధితులకు టీడీపీ సాయం

ABN , First Publish Date - 2022-08-04T00:14:04+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుతో గోదావరి వరద బాధితులను ఆదుకునేందుకు బుట్టాయగూడెం మండల టీడీపీ నేతలు ముందుకు వచ్చారు.

చంద్రబాబు పిలుపుతో వదర బాధితులకు టీడీపీ సాయం

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపుతో గోదావరి (Godavari) వరద బాధితులను ఆదుకునేందుకు బుట్టాయగూడెం మండల టీడీపీ (TDP) నేతలు ముందుకు వచ్చారు. బుట్టాయగూడెం మండల పార్టీ ఆధ్వర్యంలో ఐదు టన్నుల బియ్యం, 500 దుప్పట్లు బాధితులకు అందించారు. వేలేరుపాడు మండలంలోని జగన్నాథపురం 256 కుటుంబాలకు, తాట్కూరుగొమ్ము పంచాయతీలోని ఎర్రబోరులో 156 కుటుంబాలకు, రెపాకగొమ్ము పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు 140 కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో బుట్టాయగూడెం మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, వేలేరుపాడు మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంట్రప్రగఢ శ్రీనివాసరావు, పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, తెలుగుమహిళా నాయకురాలు జారం చాందినీ సాగరిక, తెల్లం వెంకటేశ్వరరావు, కుందుల శ్రీను, కేరం వెంకటేశ్వరావు, చిలకమూడి సుధాకర్, గన్నిన సూర్యచంద్రరావు, తూంపాటి దుర్గారావు, పసుమర్తి బిమేశ్వరరావు, సున్నం గౌతమ్, రవ్వ బసవరాజు, తుర్రం ప్రసాద్, నేరం ప్రసాద్, ఎస్టీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానేళ్ళి బాలు, నూపా శ్రీరాములు, పసుపులేటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.Read more