పన్నుల బాదుడులో ఏపీ నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2022-09-30T05:14:51+05:30 IST

పన్నుల బాదుడులో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దర బోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు.

పన్నుల బాదుడులో ఏపీ నెంబర్‌ వన్‌
ఇంటింటికి కార్యక్రమంలో మాట్లాడుతున్న ముద్దరబోయిన

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 29: పన్నుల బాదుడులో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దర బోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. గురువారం పట్టణంలోని 23వ వార్డులో  ‘మన ఇంటికి మన ముద్దరబోయిన’ అనే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి హామీల అమల్లో మడమ తిప్పుతూ తిరోగమనంలో పయనిస్తున్నారన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మల్లిశెట్టి జగదీష్‌, ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు, మాజీ పట్టణ అధ్యక్షుడు లాయర్‌ కుమార్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సుభానీ, తదితరులు పాల్గొన్నారు.

Read more