ఎమ్మెల్సీ అనంతబాబును శిక్షించాలి

ABN , First Publish Date - 2022-05-24T05:46:02+05:30 IST

వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగిపోయాయని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపడం

ఎమ్మెల్సీ అనంతబాబును  శిక్షించాలి
కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురంలో కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న దళిత, టీడీపీ నేతలు

దెందులూరు/బుట్టాయగూడెం/కొయ్యలగూడెం, మే 23 : వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత  దళితులపై దాడులు పెరిగిపోయాయని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్‌ను చంపడం చాలా అన్యాయమని, ప్రభుత్వం ఎమ్మెల్సీ అనంత బాబును కఠినంగా శిక్షించాని దళిత సంఘం నేత, మాజీ ఎంపీటీసీ నిట్టా రజనికుమారి, టీడీపీ నేత సుభాకర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండ లంలోని కొవ్వలిలో దళిత సంఘం, టీడీపీ ఆధ్వర్యంలో మాజీ డ్రైవర్‌ సుబ్ర హ్మణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కొవొత్తులతో నిరసన తెలిపారు.  అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో బుట్టాయగూడంలో సోమవారం దళితులు ఆందోళన చేశారు.  అందుగుల ప్రాన్సిస్‌  డేవిడ్‌, చిన్ని, రాంబాబు, ఏలియా, విజయరాజు తది తరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురంలో మండల టీడీపీ అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చాపల చినబాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు బొమ్మా గంట్లయ్య, కార్యదర్శి వినోద్‌కుమార్‌, తెలుగు యువత అధ్యక్షుడు సుమంత్‌, ఎంపీటీసీలు గణపతి, బాజీ, నగేష్‌, జ్యేష్ట రామకృష్ణ, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Read more