‘ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు నాశనం’

ABN , First Publish Date - 2022-11-17T00:17:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర ధరల పెంపుతో సామాన్య ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపిందని, వీటిపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరముందని దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు.

‘ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు నాశనం’
వడ్డిగూడెంలో బాదుడే బాదుడులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని

పెదపాడు, నవంబరు 16 : రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర ధరల పెంపుతో సామాన్య ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపిందని, వీటిపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన అవసరముందని దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. వడ్డిగూడెం, గుడిపాడు గ్రామాల్లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి నవర త్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఏవిధంగా మోసం చేస్తుందో వివరించారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ అధిక ధరలతో సామాన్యుల జీవితాలను నాశనం చేస్తున్నారని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. పార్టీ నాయకులు లావేటి శ్రీనివాసరావు, మోరు శ్రావణి, గుత్తా అనిల్‌చౌదరి, మోరు దశరథ్‌, ఎంపీటీసీ ఆర్‌.నాగరాజు, కరుకోటి మోహన్‌ పాల్గొన్నారు.

పట్టెన్నపాలెంలో బాదుడే బాదుడు..

జంగారెడ్డిగూడెం టౌన్‌, నవంబరు 16 : పట్టెన్నపాలెంలో టీడీపీ మండల అఽధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అఽధ్యక్షతన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యాంచం ద్రశేషు మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతీ వస్తువు ధర తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరావు, బొబ్బర రాజ్‌పాల్‌, కుక్కల మాధవరావు, ఆకుల రాములు, ఎలికే ప్రసాద్‌, బూసా సత్యనారాయణ, గొల్లమందల శ్రీనివాస్‌, రాగాని వంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-17T00:17:51+05:30 IST

Read more