-
-
Home » Andhra Pradesh » West Godavari » tdp badude badu programme at west godavari dist-NGTS-AndhraPradesh
-
‘మహిళలపై వైసీపీ నేతలకు గౌరవమే లేదు ’
ABN , First Publish Date - 2022-09-11T05:51:07+05:30 IST
రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు మహిళల పట్ల గౌరవ భావంలేకుండా తమ ఇష్టానుసారం మాట్లాడడం తగదని ఎమ్మెల్యే రామరాజు విమర్శించారు.

ఆకివీడు రూరల్ సెప్టెంబరు 10 : రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు మహిళల పట్ల గౌరవ భావంలేకుండా తమ ఇష్టానుసారం మాట్లాడడం తగదని ఎమ్మెల్యే రామరాజు విమర్శించారు. శనివారం అయిభీమవరం, మందపాడు గ్రామాల్లో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, మహిళలను గౌరవించే మనదేశంలో పరాయిస్ర్తీలను తమ నోటికొచ్చినట్లు దుర్బాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకివీడు– అయిభీమవరం రహదారిపై వర్షపునీరు నిలిచిపోవడంతో నీరు బయటకు వెళ్ళేందుకు పారతో సేడు తీశారు. పార్టీ మండల అధ్యక్షుడు మోటుపల్లి రామవరప్రసాదు, మందపాడు సర్పంచ్ గుర్రం బాలవెంకటేశ్వరరావు, నౌకట్ల రామారావు, కనుమూరు రామకృష్ణంరాజు, కనుమూరు చిట్టిరాజు, అల్లూరి సోమరాజు, మీసాల రవి, గొంట్లా గణపతి, మద్దా నరేష్, మీగడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.