‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’

ABN , First Publish Date - 2022-09-12T05:21:03+05:30 IST

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు నాయుడి తోనే సాధ్యమని, ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు.

‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’
మాట్లాడుతున్న బొరగం శ్రీనివాస్‌, తదితరులు

టి.నరసాపురం, సెప్టెంబరు 11 :రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు నాయుడి తోనే సాధ్యమని, ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. మక్కినవారి గూడెంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణాగౌడ్‌ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళుల ర్పించారు. మక్కినవారిగూడెం సర్పంచ్‌ ఎం. గోపాలరావు, జయవరపు శ్రీరామ్మూర్తి, ఆచంట సూర్యనారాయణ, బొంతు సత్యనారాయణ, పెద్దిన సత్యనారాయణ, ఆలపాటి పాపారావు, ఘంటా సతీష్‌, ఆచంట అనిల్‌, గన్నిన సురేంద్రనాఽథ్‌చౌదరి, కొల్లి మురళి, పేరం రాంబాబు, వీరేశలింగం, దండబోయిన వెంకట్రావు, పిన్నమనేని సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more