‘వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు పెంపు’

ABN , First Publish Date - 2022-11-25T00:12:54+05:30 IST

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతు న్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్‌ అన్నారు.

‘వైసీపీ పాలనలో నిత్యావసర ధరలు పెంపు’
బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు

టినర్సాపురం, నవంబరు 24 : రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతు న్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్‌ అన్నారు. కేతవరం, అల్లంచర్ల రాజుపాలెం గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జగన్‌ పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్ర కార్యదర్శులు జె.శ్రీరామమూర్తి, శీలం వెంకటేశ్వరావు, ఆచంట సూర్యనారా యణ, దొంతు సత్యనారాయణ, ఆచంట అనిల్‌కుమార్‌, నార్ని వెంకటరావు, మారుమూడి వెంకటేశ్వరావు, ఘంటా సతీష్‌, పి.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:12:54+05:30 IST

Read more