-
-
Home » Andhra Pradesh » West Godavari » tdp anna canteen-MRGS-AndhraPradesh
-
పేదల ఆకలి తీరుస్తున్న టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2022-09-20T05:26:38+05:30 IST
టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలు పేదల ఆకలి తీరుస్తున్నాయి.

తణుకు, సెప్టెంబరు 19: టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలు పేదల ఆకలి తీరుస్తున్నాయి. తణుకు కప్పల వెంకన్న సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాం టీన్ వద్ద భోజనాలు కొనసాగుతున్నాయి. సోమవారం 22వ వార్డుకు చెందిన నడిపల్లి హాసిని సహకారంతో పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు సప్పా రాజు, ఒమ్మి రాంబాబు, దూలం విక్రమ్, తోట నాగేంద్ర, మేడికొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
భీమవరం అర్బన్: పట్టణంలోని శ్రీనివాసా సెంటర్‌లో టీడీపీ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంటా త్రిముర్తులు సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు భోజనం వడ్డించారు. పార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు, నాయకులు మద్దుల రాము, యాతం శ్రీనివాస్, సతివాడ హరిబాబు, మల్లువలస రాము, గోవింద్, నసీమాబేగం, మండవల్లి ఈశ్వర్, ఎస్‌కె రబ్బానీ, గంగాధర్, దొంగ వెంకటేశ్వరరావు, కోండ్రు శ్రీనివాస్, వేమవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
––––––––––––––––––––––––
