ఇసుక బ్లాక్‌ మార్కెట్‌పై కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-08-31T05:46:35+05:30 IST

ఇసుక బ్లాక్‌ మార్కెట్‌పై కఠినంగా వ్యవహ రించ నున్నట్టు ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూప రింటెండెంట్‌ వి.అరుణకుమారి అన్నారు.

ఇసుక బ్లాక్‌ మార్కెట్‌పై కఠిన చర్యలు
వాహనాల వేలం పర్యవేక్షిస్తున్న అరుణకుమారి

నూజివీడు టౌన్‌, ఆగస్టు 30: ఇసుక బ్లాక్‌ మార్కెట్‌పై కఠినంగా వ్యవహ రించ నున్నట్టు ఏలూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూప రింటెండెంట్‌ వి.అరుణకుమారి అన్నారు. నూజివీడు సెబ్‌ స్టేషన్‌ పరిధిలో గతంలో పట్టుబడిన వాహనాల వేలంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలో ఏడు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ స్టేషన్లు వున్నాయని, అయితే జిల్లాల పునర్వ్య వస్థీకరణ పూర్తైనా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టేషన్ల పరిధులు ఇంకా మార్చాలన్నారు. గంతలో ఉన్న ఎక్సైజ్‌ శాఖ రెండు శాఖలుగా విడిపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది 30 శాతం మంది ఎక్సైజ్‌ శాఖకు బదిలీ అయ్యారన్నారు. దీంతో కొత్తగా సిబ్బందిని చేర్చుకోవాల్సి వుందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నూజి వీడు సెబ్‌ స్టేషన్‌ పరిధిలో 15 గ్రామాలను పరివర్తన గ్రామాలుగా ఎంపిక చేసి, అందులో 13 సారా రహిత గ్రామాలుగా మార్చామన్నారు. గొల్లపల్లి, ఎస్‌.ఎన్‌ తండా గ్రామాలు ఇంకా గ్రీన్‌ విలేజ్‌లుగా మార్చాల్సి వుందన్నారు. కాగా మంగళవారం ఎక్సైజ్‌ నేరాల్లో పట్టుబడిన 13 వాహనాలను వేలం వేయగా ప్రభుత్వానికి రూ.91,922లు ఆదాయం సమ కూరినట్లు  తెలిపారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ టి.గోపాలకృష్ణ,   సిబ్బంది పాల్గొన్నారు.

Read more