ఉత్సాహంగా స్విమ్మింగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-12-12T00:04:53+05:30 IST

వెస్ట్‌ గోదావరి ఆక్వా టెక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని బిశ్వనాధ్‌ భర్తియా స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఏడో రాష్ట్ర జూనియర్‌, సబ్‌ జూనియర్‌ వింటర్‌ ఆక్వాటెక్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి.

ఉత్సాహంగా స్విమ్మింగ్‌ పోటీలు
స్విమ్మింగ్‌ పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

ఏలూరు స్పోర్ట్స్‌, డిసెంబరు 11 : వెస్ట్‌ గోదావరి ఆక్వా టెక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని బిశ్వనాధ్‌ భర్తియా స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఏడో రాష్ట్ర జూనియర్‌, సబ్‌ జూనియర్‌ వింటర్‌ ఆక్వాటెక్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ఫ్రీ స్టైల్‌, బటర్‌ ఫ్లై, బ్యాక్‌ స్ట్రోక్‌, బ్రెస్ట్‌ స్ర్టోక్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలు ఈనెల 27, 28, 29 తేదీల్లో కేరళ రాష్ట్రం త్రివేండ్రంలో జరిగే సౌత్‌ జోన్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌ వెంకటరామ్‌, జిల్లా అధ్యక్షుడు గోవిందరా జు, జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

Updated Date - 2022-12-12T00:04:53+05:30 IST

Read more