మహా పాదయాత్రకు మద్దతుగా..

ABN , First Publish Date - 2022-09-27T06:14:24+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పెరుగుతోంది. సోమవారం మండలంలోని అక్కిరెడ్డిగూడెం రైతులు, టీడీపీ నాయకులు టన్నున్నర కూరగాయలు, 250 కేజీల బియ్యం, పది పెరుగు బకె ట్లను అమరావతి రైతులకు అందజేశారు.

మహా పాదయాత్రకు మద్దతుగా..
అక్కిరెడ్డిగూడెం నుంచి కూరగాయలు, బియ్యం తదితరాలు తీసుకువెళుతున్న రైతులు, టీడీపీ నాయకులు

ముసునూరు, సెప్టెంబరు 26: అమరావతి రైతుల పాదయాత్రకు  మద్దతు పెరుగుతోంది. సోమవారం మండలంలోని అక్కిరెడ్డిగూడెం రైతులు, టీడీపీ నాయకులు టన్నున్నర కూరగాయలు, 250 కేజీల బియ్యం, పది పెరుగు బకె ట్లను అమరావతి రైతులకు అందజేశారు. రైతులు, నాయకులు విరాళాలుగా ఇచ్చిన రూ 20,116ల నగదును కూడా అందజేశారు. అలాగే కాట్రేనిపాడు, చెక్కపల్లి గ్రామాల నుంచి సూమారు వంద మంది రైతులు, టీడీపీ నాయకులు రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల భూమి ఇచ్చిన రైతుల ఉసురు జగన్‌రెడ్డికి తప్పక తుగులుతుందన్నారు.    రైతుల  పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సైతం మద్దుతు తెలపాలని టీడీపీ నాయకులు, రైతులు పిలుపునిచ్చారు.

నూజివీడు: అమరావతి రైతులకు సంఘీభావంగా నూజివీడు టీడీపీ శ్రేణులు ఏలూరు జిల్లా కొనికి గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలసి పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. 

చాట్రాయి:  పెదపాడు మండలంలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో సోమవారం చాట్రాయి మండల టీడీపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.  పార్టీ మండల అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, విజయ డెయిరీ డైరెక్టర్‌ బొట్టు రామచంద్రరావు, తెలుగు యవత నాయకులు చీకటి చెన్నారావు, పాపోతు రాంబాబు తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.Read more