-
-
Home » Andhra Pradesh » West Godavari » super sanitation in villages-MRGS-AndhraPradesh
-
గ్రామాల్లో సూపర్ శానిటేషన్ చేయాలి: డీఎంహెచ్‌వో
ABN , First Publish Date - 2022-09-09T05:15:33+05:30 IST
అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.రవికుమార్ సూచించారు.

చింతలపూడి, సెప్టెంబరు 8: అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో దోమల నివారణకు ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి.రవికుమార్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని జ్వరాల జోరుపై సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. చింతలపూడి నగర పంచాయతీలో 15 డెంగీ కేసులు నమోదయ్యాయని, ఆరోగ్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్ళి డ్రైడే, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై, వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ కార్యదర్శులు అన్ని సచివాలయాల పరిధిలో సూపర్ శానిటేషన్ నిర్వహించి జ్వరాల అదుపుకు సహకరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ప్రసాదరావు, ఎంపీడీవో మణికుమారి, డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు.