సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణ మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-28T23:53:26+05:30 IST

జిల్లాలో సుబ్రహ్మణేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలతో సందడి నెలకొంది.

సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణ మహోత్సవాలు
తోలేరులో శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

భీమవరం టౌన్‌, నవంబరు 28: జిల్లాలో సుబ్రహ్మణేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలతో సందడి నెలకొంది. శ్రీరాంపురంలోని రామలింగేశ్వరస్వామి (సుబ్బరాయుడు) ఆలయంలో కల్యాణోత్సవాలు సోమవారం ప్రారంభమ య్యాయి. ఉదయం స్వామివార్లకు అభిషేకాలు, సాయంత్రం అంకుర్పాణ, ధ్వజారోహణం, హోమాలను నిర్వహించారు.

వీరవాసరం: శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. తోలేరు శ్రీవల్లీ దేవసేన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం ఆలయ అర్చకుడు బైరవబొట్ల మురళీకృష్ణశర్మ నిర్వ హించారు. ఉదయం స్వామివారి ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, త్రిశూలార్చన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. రాయకుదురు ఉమామూలేశ్వరస్వామి ఉపాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వీరవాసరం, కొణితివాడ, మత్స్యపురిపాలెం గ్రామాల్లో స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

పాలకొల్లు అర్బన్‌: పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం రాత్రి శ్రీవల్లీ దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. బ్రాడీపేట బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయలో స్వా మివారి కల్యాణం పండితులు ఈరంకి కాశీవిశ్వనాఽథశర్మ, అర్చకులు మల్లికా ర్జున శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. నాగరాజు పేట ఆలయంలో అర్చకు లు వేణుగోపాల్‌, పెద్ద సుబ్బారాయుడు గుడిలో అర్చకులు యలమంచిలి కుమార్‌ శర్మ, శంభన్న అగ్రహారం సుబ్బారాయుడు గుడిలో అర్చకులు శివ కోటి కుమార్‌, గణేష్‌ పర్యవేక్షణలో స్వామివారి కల్యాణం జరిపించారు. క్షీరా రామలింగేశ్వరస్వామి ఉపాలయంలో కల్యాణం వైభవంగా నిర్వహించారు.

Updated Date - 2022-11-28T23:53:28+05:30 IST