మా చదువును.. దూరం చేయవద్దు!

ABN , First Publish Date - 2022-02-17T05:26:35+05:30 IST

జగనన్నా.. మా చదువును దూరం చేయవద్దు.. నిన్ను వేడుకుంటున్నాం అంటూ విద్యార్థులు మోకాళ్ళపై కూర్చుని దండం పెడుతూ తమ నిరసన తెలిపారు.

మా చదువును.. దూరం చేయవద్దు!
మందపాడులో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు

మోకాళ్లపై కూర్చుని మందపాడు విద్యార్థుల నిరసన


ఆకివీడురూరల్‌, ఫిబ్రవరి 16 : జగనన్నా.. మా చదువును దూరం చేయవద్దు.. నిన్ను వేడుకుంటున్నాం అంటూ విద్యార్థులు మోకాళ్ళపై కూర్చుని దండం పెడుతూ తమ నిరసన తెలిపారు. ఆకివీడు మండలం మందపాడు గ్రామంలో ఉన్న పాఠశాలను 3 కి.మీ దూరంలో ఉన్న జడ్పీ పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో చిన్నారులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు.  తమ పాఠశాలను విలీనం చేయవద్దని విద్యార్థులు బుధవారం నినాదాలు చేశారు. తమ పిల్లలను దూరంలో ఉన్న పాఠశాలకు పంపే పరిస్థితి లేదని తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాలను గ్రామంలోనే ఉంచాలని విలీనం చేయవద్దని ఎంపీటీసీ అంగడాల సూర్యభవాని, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. 

Read more