ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల రక్తదానం

ABN , First Publish Date - 2022-05-19T05:11:38+05:30 IST

తలసేమియా బాధితుల కోసం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు బుధవారం రక్తదానం చేశారు.

ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల రక్తదానం
రక్తదానం చేస్తున్న విద్యార్థులు

భీమవరం ఎడ్యుకేషన్‌, మే 18: తలసేమియా బాధితుల కోసం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు బుధవారం రక్తదానం చేశారు. ఏలూరు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆ ధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ కె.బ్రహ్మరాజు రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. విద్యార్ధులు, ఎన్‌ఎస్‌ఎస్‌, రెడ్‌ క్రాస్‌ సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ కెఎస్‌ఎస్‌ ప్రసాదరాజు, కళాశాల బ్లడ్‌బ్యాంక్‌ కార్యక్రమాల ఇన్‌చార్జి కృష్ణచైతన్య, వెంకటపతిరాజు, కె.సురేష్‌బాబు, పి.భవాని, సీహెచ్‌ హరిమోహన్‌ పాల్గొన్నారు.

Read more