తల్లిదండ్రుల వెంటే కుమారుడు..

ABN , First Publish Date - 2022-03-16T06:19:07+05:30 IST

రోడ్డు ప్రమాదం కుటుంబాన్నే మింగేసింది. గోపాలపురం వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో బుట్టాయగూడెంకు చెం దిన రాజనాల మురళీకృష్ణ, భార్య ఊర్మిళాదేవి దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు గుణశేఖర్‌ (19) మంగళవారం రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

తల్లిదండ్రుల వెంటే కుమారుడు..

రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి\


గోపాలపురం/బుట్టాయగూడెం, మార్చి 15: రోడ్డు ప్రమాదం కుటుంబాన్నే మింగేసింది. గోపాలపురం వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో బుట్టాయగూడెంకు చెం దిన రాజనాల మురళీకృష్ణ, భార్య ఊర్మిళాదేవి దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు గుణశేఖర్‌ (19) మంగళవారం రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గుణశేఖర్‌ మృతి చెందినట్లు గోపాలపురం ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. గుణశే ఖర్‌కు ఎంబీబీఎస్‌ సీటు రావడంతో విశాఖపట్నంలో కళాశాలకు వెళ్లివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో తల్లిదండ్రులు మృత్యువాత పడ్డా రు. వారి మరణవార్త తెలియని కుమారుడు కూడా మృతిచెందడంతో బుట్టా య గూడెంలో విషాద చాయలు అలుముకున్నాయి. మురళీకృష్ణ దంపతుల మృతితో తల్లడిల్లిన బంధువులు, స్పేహితులు కుమారుడు కూడా మృతి చెందడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. మురళీకృష్ణ ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు చెన్నైలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. గుణశేఖర్‌ను డాక్టరుగా చూడాలన్న కోరిక నెరవేరకుండానే తల్లి దండ్రులు మరణించారు. పెద్దకుమారుడు నా అనేవాళ్లు లేక ఒంటరివాడయ్యాడు. చివరిసారిగా చూసేందుకు కూడా అవకాశం లేకుండా కొవ్వూరులో దహన సంస్కా రాలను కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. ఆర్‌ఎంపీల యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం సంతాపసభ ఏర్పాటుచేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read more