-
-
Home » Andhra Pradesh » West Godavari » story on errakalva floods and loss of farmers-NGTS-AndhraPradesh
-
ఎర్రకాల్వకు మోక్షమేదీ..
ABN , First Publish Date - 2022-02-19T06:14:38+05:30 IST
రైతుల దుఃఖదాయని ఎర్రకాలువ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

గట్లకు గండ్లు.. కొట్టుకుపోయిన వంతెనలు
నిధులు విడుదలైతే పనులు జరగవేం?
ఏటా నష్టపోతున్న అన్నదాత
రైతుల దుఃఖదాయని ఎర్రకాలువ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నాలుగున్నరేళ్లుగా ఎర్రకాలువ వరదలకు వేలాది ఎకరాలు మునిగిపోతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
(తాడేపల్లిగూడెం రూరల్)
గతంలో ఎర్రకాలువ వరదలకు చాలా చోట్ల గట్లకు గండ్లు పడ్డాయి. వీటికి తోడు ఎర్రకాలువపై వీరంపాలెం, మాధవరం వద్ద ఏకంగా వంతెనలే కొట్టుకు పోయాయి. వాటిని పునరుద్ధరించ లేదు. వీరంపాలెంలో రైతులంతా కలిసి వైర్లతో వంతెన వేశారు. మాధవరం కంసాలిపాలెం వద్ద కొట్టుకుపోయిన వంతెన స్థానే మరో వంతెన లేక స్థానికులు మట్టితో పూడ్చుకుని పంట చేలు చూసుకునేందుకు వెళ్తున్నారు. గట్ల పటిష్టతకు ముందుగా రూ.4.4 కోట్లు విడుదల చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తరువాత తాత్కాలి కంగా మరో రూ.1.5 కోట్లు విడుదల చేశారు. ఆ పనులు మొదలు కాలేదు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో గట్లను పటిష్ఠం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.