పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించండి

ABN , First Publish Date - 2022-11-02T23:51:50+05:30 IST

పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వారి పిల్లలను బడికి పంపించి విద్యావంతు లను చెయ్యాలని తల్లిదండ్రు లకు సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.శ్యాంసుం దర్‌ సూచించారు.

పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించండి
పిల్లలతో మాట్లాడుతున్న ఎస్‌ఎస్‌ఏ పీడీ

భీమవరం టౌన్‌, నవంబరు 2: పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వారి పిల్లలను బడికి పంపించి విద్యావంతు లను చెయ్యాలని తల్లిదండ్రు లకు సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.శ్యాంసుం దర్‌ సూచించారు. బుధవారం ఆయన అధికారులతో కలసి ఆప్రాంతాన్ని పరిశీలించారు. దాదాపు 30 మంది పిల్లలను చూసి చలించారు. పట్టణానికి మూడు కిలోమీటర్లు దూరంలో పాఠశాల ఉండడం వల్ల పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు తెలిపారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం షేక్‌ బాబాజీ సాహెబ్‌ మాట్లాడుతూ దుర్గాపురం పాఠశాలలో పిల్లలను చేర్చుతామన్నారు. కార్యక్రమంలో బి.వినాయకుడు, బి.దుర్గారావుపాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:51:50+05:30 IST
Read more