లారీల సమస్యతో ఎక్కడి ధాన్యం అక్కడే..

ABN , First Publish Date - 2022-12-09T23:52:35+05:30 IST

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపో వడం వల్ల కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందని కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు.

లారీల సమస్యతో ఎక్కడి ధాన్యం అక్కడే..
జంగారెడ్డిగూడెంలోకల్లాల వద్ద రైతులతో మాట్లాడుతున్న కె.శ్రీనివాస్‌

జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 9 : ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపో వడం వల్ల కల్లాల్లో ధాన్యం ఉండిపోయిందని కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం రైతు కల్లాల వద్ద ఆయన మాట్లాడుతూ బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యాన్ని లారీల సమస్యతో తీసుకువెళ్ళకపోవడం వల్ల ఎక్కడికక్కడే ధాన్యం నిల్వ ఉండిపోయిందన్నారు. ఆర్బీకేల్లో 17 శాతం వచ్చిన ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత తేమశాతం ఎక్కువ ఉందని చెప్పి తరుగు పేరుతో రైతులు డబ్బులు చెల్లించాలని కోరడం దారుణమన్నారు. ఈనెల 12న విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు రాయబార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పుసులూరి శ్రీహరి, నల్లబోతుల దుర్గారావు, మందపాటి గణేష్‌, పారేపల్లి సత్యనారాయణ, ఆళ్ళ వీరరాఘవులు పాల్గొన్నారు.

ఉంగుటూరు : ధాన్యం రవాణా విషయంలో సొసైటీ, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకర్లమూడి ఆయకట్టులో 1650 ఎకరాలు ఉండగా ఇప్పటివరకు ధాన్యం రవాణా విష యంలో లారీల యజమానులు, డ్రైవర్లు గాని ముందుకు రావడం లేదు. దీని కి కారణం అధ్వానంగా రహదారి ఉండడమే గ్రామస్థుల శాపం అని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏవో వెంకటేష్‌ మాట్లాడుతూ రవాణా విషయంలో సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Updated Date - 2022-12-09T23:52:38+05:30 IST