లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్‌ జయంతి

ABN , First Publish Date - 2022-02-16T05:34:06+05:30 IST

లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యా లయంలో నిర్వహించారు.

లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్‌ జయంతి
సేవాలాల్‌కు నివాళులర్పిస్తున్న లంబాడీ నాయకులు

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 15 : లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు లంబాడీ హక్కుల పోరాట సమితి కార్యా లయంలో నిర్వహించారు. సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ 1739వ సంవత్సరం ఫిబ్రవరి 15న జన్మించారన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఆయన కృషి చేశారన్నారు.  సేవా లాల్‌ జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలన్నారు. 500 మంది జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా గుర్తించారని, మిగిలిన తండా లను కూడా పంచాయతీలుగా గుర్తించాలన్నారు. వి.శ్రీనివాస్‌ నాయక్‌, జిల్లా గౌరవ అధ్యక్షుడు భూక్యా సోములు నాయక్‌, దరావత్‌ నాగేశ్వరరావు నాయక్‌, ఇస్లావత్‌ బాలాజీ నాయక్‌, భూక్యా రంగానాయక్‌, రమేష్‌ నాయక్‌, బి.భీమ్లానాయక్‌,  పాల్గొన్నారు.

ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌ : సంప్రదాయంగా వస్తున్న గిరిజన లంబాడీ, బంజారాల ఆచారాలను గౌరవిస్తూ జాతి ఔన్నత్యానికి పాటుపడాలని ఆలిం డియా బంజారా సేవా సంఘం(ఎఐబిఎస్‌ఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.కృష్ణా నాయక్‌ పిలుపునిచ్చారు. ఏలూరులోని సంఘ జిల్లా కార్యాలయంలో నిర్వ హించిన వేడుకలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో సేవాలాల్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని కోరారు. సంఘ నాయకులు జి.బాలునాయక్‌, బి.బాలా నాయక్‌, రామరాజు నాయక్‌, శ్రీను నాయక్‌ పాల్గొన్నారు.


Read more