వృద్ధుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-17T05:42:36+05:30 IST

వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వృద్ధుల సంఘం మండల అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య కోరారు.

వృద్ధుల సమస్యలు పరిష్కరించాలి
ఆకివీడులో తహసీల్దార్‌కు వినతిపత్రం

ఆకివీడు, ఆగస్టు 16: వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వృద్ధుల సంఘం మండల అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్య కోరారు. ప్రపంచ వృద్ధుల కోరికల దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్దార్‌ నీలాపు గురుమూర్తిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధమిత్ర, జిల్లాలో ఏడీ కార్యాలయం, ప్రతీ జిల్లాలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నారు. డీటీ రాజ్‌ కిషోర్‌, సంఘం కార్యదర్శి అడవి సుబ్బారావు, పేర్ల ప్రసాద్‌ ఉన్నారు.

Read more