విద్యుత్‌ సరఫరాలో తేడాలుంటే కాల్‌ చేయండి

ABN , First Publish Date - 2022-11-30T00:35:36+05:30 IST

విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన తేడాలున్నా కాల్‌ సెంటర్‌లోని 1912 నెంబర్‌కు ఫోన్‌ చేయా లని ఏపీఈపీడీసీ ఎల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు ప్రజలను కోరారు.

విద్యుత్‌ సరఫరాలో తేడాలుంటే కాల్‌ చేయండి

విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన తేడాలున్నా కాల్‌ సెంటర్‌లోని 1912 నెంబర్‌కు ఫోన్‌ చేయా లని ఏపీఈపీడీసీ ఎల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు ప్రజలను కోరారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎక్కడైనా వైర్లు తెగి పడితే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్‌కు సంబంధించి సమస్యలు పరిష్కారానికి ప్రైవేటు ఎలక్ట్రీషియన్లు కాకుండా ఇతర శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ శాఖ ప్రమేయం లేకుండా ఫీజులు, ఏబీ స్వీచ్‌లు ఆన్‌ చేయవద్దన్నారు. వ్యవసాయ పంపు సెట్ల మీటర్ల కోసం జిల్లాలో 90 వేల దరఖాస్తులు అందాయన్నారు. ఈఈ ఝాన్సీ, ఏఈ సంజయ్‌, తురగా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:35:47+05:30 IST