క్రీడా జట్ల నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2022-11-28T23:38:00+05:30 IST

వీరవాసరంలోని ఎంఆర్‌కే జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నియోజకవర్గస్థాయి క్రీడా జట్లు ఎంపికలు సోమవారం నిర్వహించారు.

క్రీడా జట్ల నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు
వీరవాసరంలో ఎంపికైన నియోజకవర్గ కబడ్డీ జట్టు

వీరవాసరం, నవంబరు 28: వీరవాసరంలోని ఎంఆర్‌కే జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నియోజకవర్గస్థాయి క్రీడా జట్లు ఎంపికలు సోమవారం నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్‌, క్రికెట్‌ జట్లు ఎంపికచేశారు. కబడ్డీకి 12 మంది, వా లీబాల్‌ టీంకు 12 మంది చొప్పున ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయస్సు దాటిన 70 మంది క్రీడాకారులు హాజరుకాగా వ్యాయామ ఉపాధ్యాయులు పీఎస్‌ఎన్‌ మల్లేశ్వరరావు, బాజింకి శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్‌ ఎంపిక చేశారు.

ఆకివీడు, నవంబరు 28: క్రీడాకారులు జాతీయస్థాయిలో పట్టణానికి గుర్తింపు తీసుకురావాలని డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నర్శింహరాజు అన్నారు. ఏఎస్‌ఎన్‌ రాజు స్పోర్ట్స్‌ అకాడమిలో సోమవారం క్రీడా సంబరాలు ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయి వాలీబాల్‌, క్రికెట్‌, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జామి హైమావతి, పీడీలు నాగరాజు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 28: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ కర్రి విజయలక్ష్మి అన్నారు.వాకర్స్‌ గ్రౌండ్‌ వద్ద సోమవారం జగనన్న క్రీడోత్సవాల సందర్భంగా కబడ్డి, వాలీబాల్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభించారు. విజేతలకు డిసెంబరు 21న బహు మతి ప్రధానం ఉంటుందన్నారు. పీడీ చింతకాయల సత్యనారాయణ, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ కోడే శ్రీను, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T23:38:02+05:30 IST