కోరుకొల్లు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

ABN , First Publish Date - 2022-11-25T00:38:19+05:30 IST

కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ డీపీవో నిమ్మగడ్డ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారని ఈవోపీఆర్‌డీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

 కోరుకొల్లు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు

కలిదిండి, నవంబరు 24 : కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ డీపీవో నిమ్మగడ్డ బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారని ఈవోపీఆర్‌డీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. ఆర్థిక లావాదేవీలపై అభియోగాలు నిర్ధారణ కావటంతో చెక్‌ పవర్‌ను రద్దు చేశారన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులకు సంబంధించి పుల్‌ చెక్‌ పవర్‌ను ఈవోపీఆర్‌డీగా తనకు ఇచ్చారన్నారు. ఈ విషయమై సర్పంచ్‌ లీలా కనకదుర్గను వివరణ కోరగా, చెక్‌ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు తనకు ఎటువంటి ఉత్తర్వులు, నోటీసులు అందలేదన్నారు. రాజకీయ కక్షతోనే చెక్‌ పవర్‌ను రద్దు చేశారన్నారు. అభివృద్ధి పనులకు తీర్మానం చేయటానికి గురువారం బోర్డు సమావేశం ఏర్పాటు చేయగా, పంచాయతీ కార్యదర్శి గైర్హాజరు అయ్యారని తెలిపారు. అభివృద్ధి పనులకు సహకరించటం లేదన్నారు.

Updated Date - 2022-11-25T00:38:32+05:30 IST

Read more