-
-
Home » Andhra Pradesh » West Godavari » rtc rm visist kovvuru depot-NGTS-AndhraPradesh
-
ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు చర్యలు : ఆర్‌ఎం
ABN , First Publish Date - 2022-02-19T05:41:13+05:30 IST
ఆర్టీసీలో నష్టాలను భర్తీచేసుకోవడంతో పాటు ఆదాయం పెంచుకునే చర్యలు తీసుకుంటునట్లు ఆర్‌ఎం ఎ.వీరయ్య చౌదరి అన్నారు.

కొవ్వూరు, ఫిబ్రవరి 18: ఆర్టీసీలో నష్టాలను భర్తీచేసుకోవడంతో పాటు ఆదాయం పెంచుకునే చర్యలు తీసుకుంటునట్లు ఆర్‌ఎం ఎ.వీరయ్య చౌదరి అన్నారు. ఆర్టీసీ కొవ్వూరు డిపోను శుక్రవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. పశ్చిమ రీజియన్‌లో ఆర్టీసీ కార్గో ఆదాయం పెంపుదలకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిపో మేనేజర్లు ట్రాఫిక్ సూపర్‌వైజర్‌లతో కార్గో పాయింట్‌లు తనిఖీచేసి ఆదాయం పెంపుదలపై ఆపరేటర్ల్లకు అవగాహన కల్పించామన్నారు. ఈ ఏడాది కార్పొరేషన్ స్థాయిలో కార్గో ద్వారా రూ.120 కోట్ల ఆదాయం వచ్చిందని, మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఖాళీ స్థలాలను దీర్ఘకాలిక లీజులకు ఇచ్చి ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూట్‌ల వారీ గా టార్గెట్‌లను పరిశీలించి నష్టాలను అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిపో మేనేజర్ వైవీవీఎన్.కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.