ప్రాణం తీసిన రోడ్డు

ABN , First Publish Date - 2022-08-21T05:45:34+05:30 IST

రహదారి రక్తదా హానికి ఒక యువకుడు బలయ్యాడు. రోడ్డు పనుల కోసం వేసిన కంకరగుట్టను ఢీకొట్టిన ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన ముచ్చి రమేష్‌ (22) మృతి చెందాడు.

ప్రాణం తీసిన రోడ్డు
సంఘటనా స్థలం వద్ద మృతి చెందిన రమేష్‌

కంకరగుట్టను ఢీకొని యువకుడి మృతి

పెంటపాడు, ఆగస్టు 20 : రహదారి రక్తదా హానికి ఒక యువకుడు బలయ్యాడు. రోడ్డు పనుల కోసం వేసిన కంకరగుట్టను ఢీకొట్టిన ప్రమాదంలో అత్తిలి గ్రామానికి చెందిన ముచ్చి రమేష్‌ (22) మృతి చెందాడు. ఇతను కారు డ్రైవింగ్‌ చేస్తూ జీవిస్తుంటాడు. శనివారం ఉదయం 5 గంటలకు  పనినిమిత్తం అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం మోటర్‌ సైకిల్‌పై వస్తు న్నాడు. పెంటపాడు మండలం ముదునూరు వద్ద రోడ్డు పనులు చేస్తుండటంతో రోడ్డుపై వేసిన కంకర గుట్టను ఢీకొట్టాడు. ఈ ఘట నలో తలకు తీవ్ర గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. రమే ష్‌కు ఐదు నెలల క్రితమే వివాహం అయినట్లు స్థానికులు తెలిపారు.


Read more