ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-11-24T23:41:58+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్‌పర్సన్‌ వేండ్ర మంగా దేవి అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పెనుమంట్రలో ధాన్యం తరలింపును పరిశీలించిన ఏవో మాధురి

పెనుగొండ, నవంబరు 24: ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్‌పర్సన్‌ వేండ్ర మంగాదేవి అన్నారు. ములపర్రులో హిందూ ముస్లిం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందుతుందన్నారు.

పెనుమంట్ర: మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని ఏవో మద్దాల జయ దుర్గా మాధురి తెలిపారు. 19 రైతు భరోసా కేంద్రాలల్లో 1390 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుతో జిల్లాలో మండలం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. హమాలీ ఖర్చులు రూ.25, రవాణా ఖర్చులు టన్నుకు 8 కిలో మీటర్లుకు రూ.324 పొందవచ్చన్నారు. తేమ 17 శాతం దాటితే ఒక పాయింట్‌కు 75కేజీల చొప్పున ధాన్యం విక్రయించవచ్చని, తేమ శాతం గురించి ఆందోళన అవసరం లేదన్నారు.

Updated Date - 2022-11-24T23:41:58+05:30 IST

Read more