25 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-07-07T06:13:19+05:30 IST

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు ఏపీ16టీవై 4363 నంబరు గల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 25 టన్నుల బియ్యాన్ని విజిలెన్స్‌ ఎస్పీ కరణం కుమార్‌ బుధవారం నూజివీడులో స్వాధీనం చేసుకు న్నారు.

25 టన్నుల రేషన్‌ బియ్యం స్వాధీనం

నూజివీడు టౌన్‌, జూలై 6:  ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు ఏపీ16టీవై 4363 నంబరు గల లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 25 టన్నుల బియ్యాన్ని విజిలెన్స్‌ ఎస్పీ కరణం కుమార్‌ బుధవారం నూజివీడులో స్వాధీనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకును గాను  కలపర్రు టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.  స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నూజివీడు పౌరసరఫరాల డీటీ ప్రసాద్‌కు అప్పగించినట్టు   తెలిపారు.

Read more